BIKKI NEWS : చToday in history december 25th
Today in history december 25thరిత్రలో ఈరోజు డిసెంబర్ 25
దినోత్సవం
- ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు
సంఘటనలు
1927 : మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు.
2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు.
2007: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.
జననాలు
1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి.
1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ “తెలుగు – ఉర్దూ నిఘంటువు” ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
1971: ఎ.కరుణాకర్ , చలన చిత్ర దర్శకుడు .
1876: భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా (మ.1948).
1977: ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
మరణాలు
1846: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)
1970: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)
1972: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
1972: కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
1996: హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)
1997: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)
1998: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు.
2009: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912)
2011: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)
2015: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)
2022: తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944)
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 12 – 2024
- TET HALL TICKETS – టెట్ హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి
- GK BITS IN TELUGU DECEMBER 27th
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27
- Manmhoan Singh – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు